
AP: విశాఖ MVP పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ ఫేమ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు నమోదైంది. అతడి ఫ్రెండ్ రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేశాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీంతో రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్ మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


