గతేడాది బిగిల్ సినిమాతో తలపతి విజయ్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అట్లీ కుమార్ ఆ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా విడుదలైన వెంటనే విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త సినిమా మాస్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవ్వాలని అనుకుంటోంది.
దురదృష్టవశాత్తు లాక్డౌన్ కారణంగా, సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కానీ చేతిలో సినిమా ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంది. ఇక నిర్మాతలు ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక అదే ఏడాది మురగాదాస్తో చేయనున్న సినిమాను కూడా రిలీజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. మురగదాస్ తో చేసిన తుపాకి, కత్తి, సర్కార్ సినిమాలు విజయ్ కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.