
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, ‘ఆయా షేర్’ పాటతో అంచనాలు పెంచిన ఈ సినిమా.. ఇప్పుడు టీజర్‌తో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
టీజర్లో అణచివేత, హింస మధ్య జీవించే ప్రజలకు అండగా నిలిచే ‘జడల్’ అనే విప్లవకారుడిగా నాని కనిపించారు. కొత్త లుక్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పూర్తిగా భిన్నంగా ఆకట్టుకున్నారు.
భారీ యాక్షన్ ఎపిసోడ్లు, జైలు పోరాటాలు, కత్తి యుద్ధాలు, పేలుళ్లు, వేలాది మందితో తెరకెక్కించిన తిరుగుబాటు సన్నివేశాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాకి ప్రతీకను వినూత్నంగా ఉపయోగించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథలో భావోద్వేగాన్ని జోడించారు.
మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, కాయడు లోహార్, సంపూర్ణేష్ బాబు పాత్రలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ టీజర్‌ను మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


