మొత్తానికి బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 తెలుగు ఆదివారం గ్రాండ్ గా మొదలైంది. కొరియోగ్రాఫర్లు, రాపర్, టెలివిజన్ హోస్ట్లు, న్యూస్ రీడర్లు, యూట్యూబర్స్ వంటి ఇతర రంగాలకు చెందిన సెలబ్రెటీలు హౌజ్ లోకి డిఫరెంట్ గా అడుగు పెట్టారు. ఇక ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్స్ ఎవరనేది ముందే లీక్ అయ్యింది.
అందరూ ఊహించిన వాళ్లే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్.. మోనాల్ గజ్జర్, సూర్య కిరణ్, లాస్యా మంజునాథ్, అబీజీత్, సుజాత, మెహబూబ్ దిల్సే, దేవి నాగవల్లి, అలెక్యా హరిక, సయ్యద్ సోహెల్, అరియానా గ్లోరీ, అమ్మ రాజ్శేఖర్, కరాటే కళ్యాణి, నోయెల్ సీన్, దివి వద్త్, లాస్ట్వా. ఈ స్టార్స్ చాలా వరకు వారి ఎంట్రీతోనే ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గంగవ్వ, లాస్య వంటి వారి ఎమోషనల్ మాటలతో షోలో హైలెట్ అయ్యారు. చూస్తుంటే బిగ్ బాస్ షో ఈ సారి సరికొత్తగా కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది.