
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో విడుదలైన సై చిత్రంలో ‘భిక్షూ యాదవ్’ పాత్రతో ప్రదీప్ రావత్ విశేష గుర్తింపు పొందారు. ఆ పాత్ర ఆయనకు ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చింది. అలాగే ఛత్రపతి, గజిని వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో విలన్‌గా నటించి తనదైన ముద్ర వేశారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. విలన్ పాత్రల్లో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ రావత్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.


