
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ రూ.50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. సాధారణంగా సల్మాన్ ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగానే తీసుకుంటారు. అయితే దిల్ రాజు బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకుడిగా తెరకెక్కుతున్న ‘SVC63’ కోసం రూ.70 కోట్లే తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరో ప్రొడ్యూసర్ రషి కాజి ఈ డీల్ వెనక ఉన్నారని సమాచారం. కాగా ఈ మూవీని 2027 రంజాన్కు రిలీజ్ చేసే సన్నాహాల్లో టీమ్ ఉంది.


