
వినూత్నమైన కంటెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి హృదయాల్లో తనదైన స్ధానాన్ని దక్కించుకున్న మోస్ట్ పాపులర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మరో ఒరిజినల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజినల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ రోజు ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు హీరో శ్రీకాంత్, పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ కిషోర్ మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చాలా చూసే వాడిని. ఈ సినిమా చాలా సీరియస్ డ్రామా. ఈ నెలలోనే స్టార్ట్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్. టీం అంతా చాలా కష్టపడి పని చేశారు అన్నారు.
జెమినీ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సీరియస్ డ్రామాను మీ ముందుకు తీసుకురావడం పెద్ద టాస్క్. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ టీం ఇందులో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. నాకు మంచి పాత్ర ఇచ్చిన జీ తెలుగు టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర, షూటింగ్ చేస్తున్నపుడు చాలా నేర్చుకున్నా. షూటింగ్ సమయంలో శ్రీకాంత్ అన్నను చూసి చాలా నేర్చుకున్నా. డే అండ్ నైట్ కష్టపడి పని చేసిన శ్రీకాంత్ అన్నను చూసి ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా అన్నారు. సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ విషయంలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన చిత్రయూనిట్ అందరికీ చాలా థాంక్స్ అన్నారు.
యాక్టర్ నారాయణ హరిచంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. శ్రీకాంత్ పక్కన నటించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ సినిమా దర్శకులు ఎంతో కష్టపడి ఈ సిరీస్ లోని ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠగా మలిచారు. ఈ సిరీస్ మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా అన్నారు.
నటి స్నేహాల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సిరీస్ షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశా. నటీనటులంతా ఎంతో సహకరించారు. నటి అనన్య మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ చూడగానే చాలా క్యూరియాసిటీ వచ్చింది. ఈ సిరీస్ సెట్ లో పని చేయడం చాలా ఎంజాయ్ చేశా. మేము చాలా ప్రెజర్ లో పని చేశాము. అంత ప్రెషర్ లో కూడా సంతోష్ సర్, సూర్య సర్ చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేశారు అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ.. ఇది వెబ్ సిరీస్ కాదు, వెబ్ ఫిలిం. ఎంతో ఖర్చు పెట్టి చాలా ఉన్నతంగా ఈ సిరీస్ రూపొందించారు. శ్రీకాంత్ అన్న లాంటి హీరో లేకపోతే ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేది కాదు. ఆయన ప్రొడ్యూసర్స్ హీరో. డైరెక్టర్స్ యాక్టర్. ఈ సినిమా టీం అంతా చాలా కష్టపడ్డారు. జూలై 31 న విజువల్ ఫీస్ట్ చూడబోతున్నారు అన్నారు.
నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ.. జీ 5 టీం కి చాలా థాంక్స్. ఈ సినిమాకు మెయిన్ అసెట్ శ్రీకాంత్. ముకేశ్, అనన్య సహా అందరూ కూడా బాగా చేశారు. వీళ్లందరితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అన్నారు.
డైరెక్టర్ సంతోష్ అయ్యప్పన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన జీ 5 టీం కి కృతజ్ఞతలు. 19 రోజుల్లో ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా ఫినిష్ కావడంలో సూర్య, మా ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ పాత్రం గొప్పది. ముకేశ్ గారు, శ్రీకాంత్ గారు, అనన్య గారు, జెమినీ సురేష్ గారు ఇలా అందరూ ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఇంత త్వరగా షూట్ ఫినిష్ చేశాము. నటీనటులతో పాటు టెక్నీకల్ టీం కూడా ఎంతో శ్రమిస్తూ ఈ సిరీస్ లో భాగమయ్యారు. ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అన్నారు.
యాక్టర్ ముఖేష్ రిషి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. జీ 5 కి, రాజ్ కుమార్ కి, సూర్య కి చాలా థాంక్స్. ఈ సిరీస్ కోసం శ్రీకాంత్ గారు 18 గంటలు కష్టపడి పని చేశారు. జూలై 31న ఫ్యామిలీతో ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జీ 5 లో నాది ఇది మూడో వెబ్ సిరీస్. ఈ మూడింటిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే చేశారు. జీతో నాకు మంచి అనుబంధం ఉంది. 3 సిరీస్ లు చేయడంతో పాటు డ్రామా జూనియర్స్ కూడా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సినిమాలో కంటే సిరీస్ లోనే కష్టం ఎక్కువగా ఉంది కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. దర్శకుడు ఎంతో మెలకువతో చాలా క్లారిటీతో ఈ సిరీస్ రూపొందించారు. షూటింగ్ సమయంలో నిర్మాత రాజ్‌కుమార్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సిరీస్ అవుట్ ఫుట్ చూశాక ఫిదా అయ్యాము. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. నటీనటులంతా ఎంతో ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొన్నారు. ముఖేష్ గారు యాక్టర్ మాత్రమే కాదు ప్యూర్ హార్ట్ మనిషి. ప్రతి క్యారెక్టర్ లో మంచి ఎలివేషన్ ఉంటుంది. అందరూ బాగా చేశారు. చిరంజీవి గారు కూడా చూసి చాలా బాగుందని చెప్పారు. థాంక్యూ ఆల్ అన్నారు.


