“చెన్నై లవ్ స్టోరీ” చిత్ర రివ్యూ

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి రచన దర్శకత్వంలో ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ చేయగా సంతోష్ నాయుడు ఎడిటింగ్ చేశారు. త్రిగున్, సిరి హనుమంత్, మహేందర్, నవీన్, నరేష్, పూజ, శశాంక్ మౌళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో తన ఉద్యోగం కోసం యువతి (గౌరీ ప్రియ) చెన్నై వచ్చేస్తుంది. అక్కడ దర్శకుడు కావాలనుకునే ఒక యువకుడు (కిరణ్ అబ్బవరం) పరిచయం అవుతాడు. అనాధ అయిన అతను కథలు పట్టుకొని దర్శక అవకాశం కోసం కష్టపడుతూ ఉంటాడు. కొత్తగా పరిచయం అయిన ఈ స్నేహితులతో ఉంటూ ఆమెకు కాస్త దగ్గరవుతాడు. వారి ఇద్దరి పరిచయం ఎలా ప్రేమగా మారుతుంది? ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా? తన గత జీవితంలో ఉన్న యువకుడు (త్రిగున్) వల్ల వీరి జీవితాలలో మార్పులు ఏమైనా వస్తాయా? చివరికి ఆ యువతి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
కిరణ్ అబ్బవరం (స్టీవెన్ శంకర్) దర్శకునిగా మారెందుకు ఒక అనాధ యువకుని లాగా ఈ సినిమాలో చాలా సాధారణంగా కనిపిస్తూ బాగా నటించారు. ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు. గౌరి ప్రియ (నివి) తన పాత్రను అద్భుతంగా పోషించారు. ఇష్టంగా ఎమోషన్స్ క్యారీ చేస్తూ సినిమా అంతటా ప్రేమను, అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన క్యారెక్టర్ ను అత్యద్భుతంగా తన ఎమోషన్స్ ను అర్థం చేస్తూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఈ చిత్రం గౌరీ ప్రియ సినీ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంలో ఉంటుంది. త్రిగున్ (అజయ్) పాత్ర తక్కువ అయినప్పటికీ తన ఇంపాక్ట్ సినిమా అంతటా కనిపిస్తూ ఉంటుంది. కాస్త కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ తో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం ట్రిగున్కు ఒక మార్క్ లా మిగిలిపోతుంది. అలాగే సిరి హనుమంత్, మహేందర్, నవీన్ తదితర నటీనటులు అందరూ తమ తమ పాత్రలో పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
ఎన్నో ప్రేమ కథల మధ్యలో ఒక భిన్నమైన ప్రేమ కథను తీసుకొని దానిని ప్రేక్షకులు థియేటర్ వరకు వచ్చి చూసేంత అద్భుతంగా దర్శకత్వం చేసి వెండితెరపై చూపించడంలో దర్శకులు విజయం సాధించారు. అలాగే లొకేషన్స్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమాకు మరొక ప్లస్. పాటలు చాలా బాగున్నాయి, అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త తగ్గినప్పటికీ కథకు అనుకూలంగా ఉండటంతో ప్రేక్షకులు సంగీతాన్ని ఫీల్ అయ్యేలా ఉంది. విఎఫ్ఎక్స్ వంటి ఇతర సాంకేతిక విషయాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :
కొన్ని ఊహించే సాగదీత సన్నివేశాలు

సారాంశం :
సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకులు గుండెకు హత్తుకునే విధంగా మనసు లోతులోకి వెళ్లిన ప్రేమ కథ “చెన్నై లవ్ స్టోరీ”. కుటుంబ సమేతంగా ఎటువంటి అభ్యంతర సీన్స్, డైలాగ్స్ లేకుండా చూడదగిన చిత్రం.

Related Articles

Latest Articles