బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ప్రతి సినిమాకు ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాల కంటే ఎక్కువ స్థాయిలో విజయాన్ని అందుకుంటే ఆటో మేటిక్ గా రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితులలో బిగ్ బాస్ విషయంలో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తగ్గినట్లు మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
అక్టోబర్ లో హిందీ బిగ్ బాస్ 14 మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ షో 12 వారాలు మాత్రమే ఉంటుందట. కంటెస్టెంట్స్ కూడా గతంలో కంటే తక్కువమందిని ఎంపిక చేసినట్లు టాక్ వస్తోంది. ఇకపోతే సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ కూడా తగ్గినట్లు సమాచారం. అసలైతే ఈ సారి సల్మాన్ ఫీజు 400కోట్లకు పైగా ఉంటుందని మొదట్లో టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు కేవలం 250కోట్లు మాత్రమే అందుకోనునట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తేలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.