జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. సహాయ నిరాకరణ ప్రకటించిన ఫెడరేషన్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఆయనపై సంచలన నిర్ణయం తీసుకుంటూ సహాయ నిరాకరణ ప్రకటించింది. ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జానీ మాస్టర్ దేశవ్యాప్తంగా ఏ సినిమా చేసినా ఫెడరేషన్‌కు చెందిన 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఆ సినిమాకు పనిచేయరని నిర్ణయించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేయనున్నట్లు తెలిపింది.

అలాగే, భార్య పదవిని అడ్డుపెట్టుకొని జానీ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులోగా జానీ మాస్టర్ నుంచి సరైన వివరణ రాకపోతే ఆయనపై శాశ్వత బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశముందని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరించింది. ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles