మీడియాపై ‘రియా’ ఫైర్.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు!!

బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సుశాంత్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొదట నెపోటిజమ్ వల్లే సుశాంత్ మరణించడనే విషయంపై ఎక్కువగా ఫోకస్ చేసిన బాలీవుడ్ మీడియా ఎప్పుడైతే సుశాంత్ తండ్రి రియపై కేసు నమోదు చేశాడో అప్పటి నుంచి అమెపైనే దృష్టి పెట్టారు.

ఇక ఎప్పటికప్పుడు రియా ఇంటిపై కూడా బాలీవుడ్ మీడియా నిఘా పెట్టడంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా సీబీఐ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్నప్పుడు కూడా రియా ఇంటి వద్ద నార్త్ మీడియా ఒక్కసారిగా చుట్టూ ముట్టడంతో రియా సోదరుడితో కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది కెమెరామెన్స్ కూడా ఆమె ఇంటిలోకి రావడానికి ప్రయత్నం చేశారని అడ్డు పడిన వాచ్ మెన్ పై కూడా గొడవకు దిగారని రియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అయితే కొద్దిసేపటికే రియా మళ్ళీ ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. ఇక పోలీసుల సహాయం కోరడంతో రియా బందోబస్తుతో ఇంటికి చేరుకుంది.