సూపర్ స్టార్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక నటుడిగా చెరగని ముద్ర వేసుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఒక వెండితెర వారధిగా ఆయన సృష్టించిన పద్మాలయ స్టూడియో గొప్పతనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్న పదానికి కృష్ణ అప్పుడే మొదట అడుగు వేశారు. ఆ స్టూడియో స్థాపనకు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా మోసగాళ్లకు మోసగాడు.
ఈ సినిమా విడుదలై నేటితో 50వసంతంలోకి ప్రవేశించబోతోంది.
ఇండియన్ స్క్రీన్‌లో మొదటి కౌబాయ్ చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు ఆల్ టైమ్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా 1971 ఆగస్ట్ 27న విడుదలైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ స్పానిష్ బెంగాలీ వంటి భాషల్లో కూడా విడుదలై ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకుంది. ఒక విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని అప్పట్లో ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇదేనని చెప్పవచ్చు. హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆరుద్ర రచించిన ఆ కథకు KSR దర్శకత్వం వహించగా ఆదినారాయణ రావ్ సంగీతం అందించారు. ఇక కృష్ణకు జోడిగా విజయ నిర్మల హీరోయిన్ నటించగా నాగభూషణం, గుమ్మడి, కైకాల సత్యనారాయణ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో నటించారు.