ప్రభాస్ అభిమానులకు ఇంతకంటే పెద్ద గుడ్ న్యూస్ మరొకటి ఉండదేమో..

చాలా వరకు కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమా థియేటర్లు మూతపడటం అలాగే షూటింగ్స్ కూడా నిలిచిపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక స్టార్ హీరోల అభిమానులకు కూడా ఇది కొంత నిరుత్సాహ పరిచే విషయమే. కానీ ప్రభాస్ మాత్రం తన అభిమానులకు మూడు సినిమాల అప్డేట్స్ తో ఒక మంచి జోష్ ఇచ్చాడనే చెప్పాలి.

గతంలో బాహుబలి సినిమా కారణంగా ఐదేళ్ల సమయం తీసుకున్న ప్రభాస్ ఒక విధంగా అభిమానుల ఓపికకు పెద్ద పరిక్షే పెట్టాడు. ఇక సాహో సినిమా కోసం కూడా ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఏడాదికొక సినిమా అంధించాలని స్ట్రాంగ్ గా డిసైస్ అయినట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవల అది పురుష్ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సైన్స్ ఫిక్షన్ కథను చేయనున్నాడు. ఈ మూడు సినిమాలను పెద్దగా గ్యాప్ లేకుండా ఒకదాని తరువాత ఒకదాన్ని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఒక విధంగా లాక్ డౌన్ లో అభిమానులకు ప్రభాస్ ఇచ్చిన అప్డేట్స్ మంచి కిక్కిచ్చాయనే చెప్పాలి. మరి ఆ సినిమాలు రిలీజ్ తరువాత ఎలాంటి వందర్స్ ని క్రియేట్ చేస్తాయో చూడాలి.