సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో, సిబిఐ కాకుండా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా జోక్యం చేసుకుంది. రియా చక్రవర్తి డ్రగ్స్ కోసం వాట్సాప్ లో సీక్రెట్ గా చాట్ చేసిందనే విషయం బయటకు రావడంతో ఆమెకి మరో షాక్ తగిలినట్లయ్యింది. డ్రగ్స్ తీసుకొన్నట్లు ఆరోపణల అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొన్ని సాక్ష్యాలు కనుగొంది.
ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రీసెంట్ గా రియాపై అలాగే ఆమె ఆమె స్నేహితులపై కేసు నమోదు చేసింది. రియా చక్రవర్తి మరియు ఈ కేసులో పేరున్న ఇతరులకు త్వరలో పరీక్షకు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో దర్యాప్తు ప్రకారం రక్త పరీక్షలు చేయనున్నారు. వాట్సప్ లో చాట్ లీకైన అనంతరం ఆ కోడ్స్ ని బట్టి వారు డ్రగ్స్ వాడకం గురించి సంభాషించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కాఫీలో డ్రగ్ కలిపి సుశాంత్‌కు ఇచ్చి ఉండొచ్చని మరో కొత్త అనుమానం కూడా బయటపడింది. ఇక ఇప్పుడు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసును దర్యాప్తు చేయబోతోంది. రియాపై అలాగే మరికొందరిపై ఎన్‌సిబి సెక్షన్ 28 (నేరాలకు పాల్పడే ప్రయత్నాలకు శిక్ష), 29 (దుర్వినియోగం మరియు నేరపూరిత కుట్రకు శిక్ష) మరియు 20-బి (డ్రగ్ ఉత్పత్తి, తయారీ, కలిగి, అమ్మకం, కొనుగోలు, రవాణా, ఇంటర్-స్టేట్ దిగుమతి, ఇంటర్ స్టేట్ ఎగుమతి, డ్రగ్ వాడకం) ప్రకారం కేసులు నమోదయ్యాయి.