
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం #VenkyAnil5 / #NKRAR2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నాయి.
ఇటీవల కళ్యాణ్ రామ్‌తో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసిన చిత్రబృందం, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ షెడ్యూల్‌లో తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొన్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు.
వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సీన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అనిల్ రావిపూడి మార్క్ హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో తెరకెక్కుతూ సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


