హైదరాబాదు లో ని శ్రీనగర్ కాలనీ తన నివాసంలో తనికెళ్ళ భరణి గారు విత్తన గణపతి గురించి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – ఏకో ఫ్రెండ్లీ గణేష్ లో భాగంగా కాదంబరి కిరణ్ గారి ద్వారా వినాయక చవితి ముందు విత్తన గణపతి విగ్రహాన్ని పంపించడం జరిగింది… మా ఇంట్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాం ఈ యొక్క విత్తన గణపతి యొక్క ప్రత్యేకత దీన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే ఒక విత్తనం ద్వారా కొన్ని రోజుల్లో ఒక మొక్క మొలుస్తుంది . ఆ మొక్కని అలాగే మన ఇంటి పరిసరాల్లో నాటుకోవాలి .కొత్త జీవం మొక్క ద్వారా ఆవిర్భవిస్తుంది . ఆ మొక్క ని పవిత్రంగా భావించి , పెంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణం లో మనం జీవించవచ్చు .ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను