వెంకీ గ్రీన్ సిగ్నల్.. F3 మొదలయ్యేది అప్పుడే..

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ కామెడీ ఫిల్మ్ F2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే అదే కాంబినేషన్ లో మరొక హీరోను చేర్చుకొని F3 సినిమాను రెడీ తెరకెక్కించాలని అనిల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

లాక్ డౌన్ లోనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన అనిల్ హీరోల డేట్స్ కోసం మొన్నటివరకు చాలానే ప్రయత్నాలు చేశారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ మొదట్లో వెంకీ ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా ఇటీవల దిల్ రాజుతో కలిసి మరోసారి మాట్లాడగా సంక్రాంతికి తప్పకుండా స్టార్ట్ చేద్దామని వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరోవైపు వరుణ్ తేజ్ కూడా అదే తరహాలో క్లారిటీ ఇచ్చినట్లు టాక్. అయితే మరొక హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే F3 ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.