టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బాక్సాఫీస్ హిట్స్ తో పాటు కొన్ని ఊహించని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అందులో ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా ఒకటి. నిజానికి ఆ సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పైగా తమిళ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. కానీ దర్శకుడు ఎలాంటి నమ్మకంతో ఆ సినిమాను తెరకెక్కించాడో తెలియదు గాని సినిమా టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
ఆ సినిమా కొట్టిన దెబ్బకు మళ్ళీ ప్రయోగాలు చేయకూడదని మహేష్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఒకసారి డిజాస్టర్ ఇచ్చిన హీరోతో మరోసారి వర్క్ చేయడానికి ఇష్టపడని మహేష్ మళ్ళీ ఏఆర్.మురగదాస్ తో కలిసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. నెక్స్ట్ ఈ కోలీవుడ్ దర్శకుడు విజయ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తుపాకి సినిమాకు సీక్వెల్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన మురగదాస్ ఇంకా ఆ ప్రాజెక్ట్ కి నిర్మాతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అన్నారు. ఇక విజయ్ ప్రాజెక్ట్ అనంతరం మురగదాస్ భవిష్యత్తులో మహేష్ తో మరోసారి వర్క్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.