ఇటీవల లెజండరీ సింగర్ SP. బాలసుబ్రహ్మణ్యం కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. బాలు గారు త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు ఎంతో మంది సినీ తారలు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. అయితే SPB కి కరోనా సోకింది తన వల్లే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాళవిక స్పందించారు.
అందులో ఎలాంటి నిజం లేదని మాళవిక ఒక వీడియో ద్వారా తెలియజేశారు. జూన్ 31వ తేదీన నేను రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్నాను. అంతకంటే ముందే బాలుగారు అలాగే చాలా మంది ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. అప్పటివరకు నాకు కరోనా లేదు. జూన్ 5వ తేదీన బాలు గారికి కరోనా వచ్చిందని తెలియగానే నేను నా కుటుంబ సభ్యులం టెస్ట్ చేయించుకున్నాము. అమ్మ, నాన్నతో పాటు పాపకి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మేము చాలా బాధలో ఉన్నాము. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయవద్దని మాళవిక వివరణ ఇచ్చారు.