
V సమ్మర్ లో రావాల్సిన ఒక బిగ్ బడ్జెట్ సినిమా. పైగా నాని 25వ సినిమా. అందులోను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించినది. అలాంటి సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుండడంతో మిగతా సినిమా వాళ్ళు కూడా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. నిశబ్దం సినిమాతో పాటు మరికొన్ని మిడియామ్ బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాల్లో ఎంతో కొంత దీక్ష సెట్ చేసుకొని డిజిటల్ బిజినెస్ ని క్లోజ్ చేసుకునే పనిలో పడ్డాయి.
ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, వైష్ణవ్ తేజ్ ఉప్పెన, రామ్ రెడ్ అలాగే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ కోసం చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక శర్వానంద్ శ్రీకారం అలాగే మాస్ మహారాజా క్రాక్ సినిమాలు డైరెక్ట్ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతాయని క్లారిటీ వచ్చినప్పటికీ ఆలస్యం అయితే సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని వారు కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఎవరు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.