
భారతదేశంలోని పలు బ్యాంకులను మోసం చేసి యుకెకు వెళ్లి అక్కడే చాలా రోజులుగా దాక్కుంటున్న విజయ్ మాల్యా గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే అతన్ని స్వదేశానికి రప్పించడానికి అధికారులు ఎంతగా కష్టపడుతున్నా కూడా ఫలితం దక్కడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అతని జీవిత ఆధారంగా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అతని వివాదాస్పద జీవనశైలిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెబ్ సిరీస్ ని రూపొందించానున్నారట. రచయిత కె. గిరిప్రకాష్ రాసిన ‘ది విజయ్ మాల్యా స్టోరీ’ బుక్ యొక్క హక్కులను ఇటీవల ఆల్మైటీ మోషన్ పిక్చర్ సొంతం చేసుకుంది.
అయితే వెబ్ సిరీస్ లో విజయ్ మాల్యా పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అన్ని భాషల వారికి తెలిసిన టాప్ స్టార్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక మరోవైపు మహేష్ బాబు నటించనున్న సర్కారు వారి పాటలో విజయ్ మల్యం ఆధారంగానే ఒక పాత్రను డిజైన్ చేసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ మాల్యా వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.