రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో సినిమాలు రిలీజ్ కానున్నట్లు ఋజువయ్యింది. గత కొన్ని రోజులుగా V సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఈ విషయంలో చిత్ర యూనిట్
అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.
నాని V సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు నాని అధికారికంగా తెలియజేశాడు. అసలైతే సినిమాను ఈ ఎడది మార్చ్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ మొదలవ్వడంతో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవని చిత్ర యూనిట్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.