నటి మాధవి లతపై కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్ గా ఒకప్పుడు బిజీగా ఉన్న నటి మాధవి లత ప్రస్తుతం రెగ్యులర్ రాజకీయాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న మాదవి అప్పుడప్పుడు పలు కాంట్రవర్సీ కామెంట్స్ తో పోలీస్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదైంది.

వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి మాదవిలత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే ఆరోపణతో ఈ కేసు నమోదు చేశాడు. దీంతో పోలీసులు 295-A సెక్షన్ కింద కేస్ నమోదు చేశారు. ‘హిందూ ధర్మం దాని రక్షణ అని పిసుక్కునే ఫేస్‌బుక్ హిందూ ధర్మ రక్షకులకి, వీరాది వీరులకి, శూరులకి, దొంగ భక్తులకి నా విన్నపం. ఈ వీడియో మొత్తం చూసి హిందువుల మీద జరిగే దాడులు చేసేవాళ్ళని ప్రశ్నించి అడిగి కడిగి దులిపి తుడిచి లాగిపెట్టి కొట్టి, మీ దమ్ము చూపించి, మీ భక్తి చూపించి, మీ గుండె చూపించి తర్వాత వచ్చి నా చీర గురించి మాట్లాడండి అంటూ ఒక వీడియో లింక్ ని ఇటీవల మాదవిలత ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది బహుశా అదే విషయంపై కేసు నమోదై ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.