కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, అలాగే మరో స్టార్ హీరో కమల్ హాసన్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలా రకాల కథలపై చర్చలు జరిపినప్పటికి ఎందుకో ఈ మల్టీస్టారర్ కాంబినేషన్ సెట్టవ్వలేదు. అయితే ఫైనల్ గా ఒక దర్శకుడు అభిమానులకు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు.
నిజమా అబద్దామా అని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న సమయంలో ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాజిటివ్ గా స్పందించారు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లోనే ఆ మల్టీస్టారర్ సినిమా రానుందని చెబుతూ.. చర్చలు దాదాపు ముగిసాయని మరోసారి అగ్రిమెంట్ పై చర్చించే అవకాశం ఉందని బహుశా సెప్టెంబర్ లో అభిమానులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉండవచ్చని అన్నారు. మరి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం రజినీకాంత్, కమల్ హాసన్ ఒక్కో సినిమాతో బిజీగా ఉండగా.. దర్శకుడు లోకేష్ మాస్టర్ సినిమాను ఫినిష్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ కానుంది.