పిల్లలు కనడం కన్నా ఆ నిర్ణయమే మంచిది: బిపాసా బసు

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ బిపాసా బసు చాలా రోజుల తరువాత మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చి నాలుగేళ్లయినా కూడా ఆమె ఇంకా హీరోయిన్ లానే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో డేంజరస్ అనే వెబ్ కంటెంట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక 2016లోనే ఈ బ్యూటీ టీవీ యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు కనడంపై బిపాసా ఇటీవల ఎవరు ఊహించని విధంగా స్పంధించారు.

గతంలోనే బిపాసా ప్రెగ్నెంట్ అనే రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ వాటి గురించి బిపాసా ఎక్కువగా పట్టించుకోలేదు. ఇక ఇటీవల ఈ బ్యూటీ ఒక మంచి విషయాన్ని తెలిపింది. తాము బిడ్డను కనాలని అనుకోవడం కన్నా కూడా దత్తత తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతామని అన్నారు. దేశంలో చాలా మంది అనాధ పిల్లులు ఉన్నారని చెబుతూ.. వారిని దత్తత తీసుకుంటే రెండు విధాలుగా మంచి పనులు చేసినవారం అవుతామని, వారికి తల్లిదండ్రులతో పాటు మనకు బిడ్డలు కూడా దొరుకుతారని అన్నారు. భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తామని బిపాసా భర్తతో కలిసి చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది.