అఖిల్ కోసం సీనియర్ దర్శకుడిని లైన్ లో పెడుతున్న నాగార్జున

అక్కినేని నాగార్జున ఒకవైపు తన ప్రాజెక్టులను చూసుకుంటూనే మరోవైపు కొడుకుల సినిమాల గురించి కూడా గట్టిగానే ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా అఖిల్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పేడుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అఖిల్ నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు.

ఇక నాగార్జున తనయుడి కోసం సీనియర్ దర్శకుడైన తేజను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే తేజ కరోనా వైరస్ భారిన పడటంతో చర్చలకు బ్రేక్ పడింది. తేజ పూర్తిగా కోలుకున్న తరువాత మరోసారి వీరి మధ్య కొత్త తరహా కథపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ కోసం ఒక కథను సెట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఆ రూమర్స్ పై ఒక క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సంక్రాంతికి రానున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.