చీరలో ప్రతి ఒక్క హీరోయిన్ అందంగానే కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అందమైన భామల కారణంగా ఆ చిరాలకే అందం వస్తుంటుంది. ఇటీవల బిపాసా బసు కూడా అదే తరహాలో సరికొత్తగా దర్శనమిచ్చింది. వివిధ రకాల రంగుల చీరలలో అందమైన సీతాకోక చిలుకలా ఆకర్షించింది. టక్కరి దొంగ సినిమా ద్వారా తెలుగు తెరకు పతిచయమైన బిపాసా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది.
2002లో రాజ్ సినిమా ద్వారా బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ ను అందుకోవడం స్టార్ట్ చేసింది. కొన్నాళ్లకు స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ స్పెషల్ రోల్స్ తో కూడా మెప్పించింది. ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసులో కూడా ఇలా యువ హీరోయిన్స్ కుళ్ళుకునేలా ట్రేడిషినల్ లుక్ లో మంత్రం ముగ్దుల్ని చేస్తోంది. 2017లో కరణ్ సింగ్ గ్రోవర్ అనే బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకున్న బిపాసా చాలా వరకు నటనకు దూరంగానే ఉంటోంది. ఇక ప్రస్తుతం డేంజరస్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది.