బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పటి నుంచి కూడా రియా చక్రవర్తి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక ఆమె వల్లే తన కొడుకు మరణించాడు అంటూ సుశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసినప్పటి నుంచి కూడా రియా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అయితే బీహార్ పోలీసుల ఇన్వాల్మెంట్ లేకుండా ముంబై పోలీసులకు పూర్తి బాధ్యతల్ని అప్పగించాలని కొన్నిరోజుల క్రితం రియా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇక ఇటీవల ఆ విషయంపై రెండవసారి రియా తన లాయర్ ద్వారా వాదనను వినిపించింది. ప్రస్తుతం ప్రేమించిన వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్నాను. ఇలాంటి సమయంలో నేను మళ్ళీ బాధితురాలిగా ఉన్నాను. దోషిగా చిత్రీకరీంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక ముంబై పోలీసులకు కేసుని అప్పగించడం సరైన పని ఆమె వివరించారు. అందుకు న్యాయస్థానం సమాధానం ఇస్తూ.. సీబీఐ చేత విచారణ జరిపించాలని మీరే అడిగారు. వారు సేకరించే వివరాలు వారు సేకరిస్తారు. అసలు విషయలు ఏమిటనేవి భవిష్యత్తులో తెలుస్తాయి. కాబట్టి సీబీఐకి సహకరీంచాలనే విధంగా న్యాయస్థానం వివరణ ఇచ్చింది.