మెగాస్టార్ చిరంజీవి వంటలు ఎంత ఇష్టంగా చేస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిరంజీవి దోస అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ స్టార్ హీరో అప్పుడప్పుడు తన తల్లి అంజన దేవి కోసం కొన్ని స్పెషల్ వంటకాలను చేస్తూ ఉంటారు. లాక్ డౌన్ నుంచి ఇంట్లోనే ఉంటున్న మెగాస్టార్ అప్పుడప్పుడు డిఫరెంట్ గా వంటలు చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిన్నప్పుడు అమ్మ చేసిన వంటను మరోసారి అమ్మకు రుచి చూపించారు. చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు అంటూ ఆదివారం మెగాస్టార్ ప్రత్యేకంగా రెడీ చేశారు. ఇక తన తల్లికి వడ్డిస్తూ కాస్త టెన్షన్ పడ్డారు. హిట్ అంటుందో ఫట్ అంటుందో అని కంగారు పడుతుండగా అంజన దేవి బావుందని చెప్పారు. దీంతో మెగాస్టార్ ఒక్కసారిగా సంతోషానిక్ గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.