యూ ట్యూబ్ ఫేక్ వ్యూవ్స్ కోసం 75లక్షలు ఖర్చు చేసిన సింగర్!

ర్యాపర్ గా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సింగర్ బాద్ షా. కొన్ని ప్రయివేట్ పాటలతో మంచి క్రేజ్ అందుకున్న ఈ సింగర్ ఫేక్ వ్యూవ్స్ స్కామ్ లో దొరికిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇక ఇటీవల బాద్ షా పాగల్ హై అనే సాంగ్ ని యూ ట్యూబ్ లో విడుదల చేశాడు.

24గంటల్లో 7.2కోట్ల వ్యూవ్స్ కోసం ఒక కంపెనీకి 72లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక అతని సాంగ్ కి ఊహించని విదంగా ఒక రోజులోనే 75మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఈ వ్యూవ్స్ ఫేక్ అని గూగుల్ కూడా అసలు విషయాన్ని బయటపెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాద్ షాను ఇటీవల కొన్ని గంటలపాటు విచారించారు. అయితే బాద్ షా మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని అంటూ ఈ విషయంలో తప్పకుండా తనకు న్యాయం జఫుగుతుందని అన్నారు.