తెలుగు చిత్ర పరిశ్రమకు మరో క్యూట్ హీరోయిన్ భైరవి

కొత్త మలుపు టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ భైరవి. అస్సాం నుంచి వచ్చిన ఈ భామ కొత్త మలుపు సినిమా టీజర్‌, ట్రైలర్ కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్, స్క్రీన్‌పై కనిపించిన కాన్ఫిడెన్స్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఇంప్రెషన్ వేసింది.

భైరవి లుక్స్ చూసిన కొందరు ప్రేక్షకులు ఆమెను రష్మిక మందన్నతో పోలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె స్మైల్, ఫేస్ కట్‌లో కొంత పోలిక ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అందం మాత్రమే కాదు, నటనకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. అందుకే “బ్యూటీతో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉన్న హీరోయిన్” అనే టాక్ ఇప్పటికే మొదలైంది.

ఇటీవల కాయదు లోహర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనట్లే, ఇప్పుడు అస్సాం నుంచి వచ్చిన మరో హీరోయిన్‌గా భైరవి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి స్పందన కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఆమెను తమ కొత్త క్రష్‌గా అభివర్ణిస్తున్నారు.

ప్రమోషనల్ ఈవెంట్‌లో భైరవి తెలుగులో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం కూడా అందరినీ ఆకట్టుకుంది. కొత్త భాషను నేర్చుకుని ప్రేక్షకులతో వారి భాషలో మాట్లాడాలని చూపించిన ఆసక్తి ప్రశంసనీయమే. ఆ ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు.

టీజర్‌, ట్రైలర్ తో ఆకట్టుకున్న భైరవి, సినిమా విడుదల తర్వాత తన నటనతో కూడా మెప్పిస్తే తెలుగు సినిమాకు మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికినట్టే.

కొత్త మలుపు” జూన్ 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ప్రస్తుతం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Latest Articles