నా అందమైన నవ్వు నువ్వే.. జెనీలియాకు రితేష్ లవ్లీ విషెస్

తెలుగు వారికి బాగా తెలిసిన హాసిని ఎవరంటే.. జెనీలియా డీ సౌజా. బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి బాక్సాఫీస్ హిట్స్ తో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న జెనీలియా కొన్నాళ్లకు బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేసింది. ఇక అక్కడ రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడిన ఈ బ్యూటీ హ్యాపీగా పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాలు చేస్తోంది.

ఇక ఇటీవల జెనీలియా 33వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త రితేష్ దేశ్ ముఖ్ ఒక లవ్లీ పోస్ట్ తో ఆమెకు విషెస్ అందించాడు. ‘నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా శాశ్వతమైన నవ్వు, క్రైమ్ పాట్నర్, నా ఆనందం, నా గైడ్, నా ఉత్సాహం, నా జీవితం, నా ప్రతిదీ నువ్వే.. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మీతో యవ్వనంగా ఎదగడం ఒక ఆశీర్వాదం అంటూ రితేష్ వివరణ ఇచ్చాడు. అందుకు సమాధానం ఇచ్చిన జెనీలియా.. మనకు, మన లోపాలకు, మన బలహీనతలకు, మన బలానికి, మన ఆనందానికి. మీరు నేను కావాలి. నిన్ను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని.. జెనీలియా పేర్కొన్నారు.