బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఎలాంటి సమాధానం ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. టీమిండియా కెప్టెన్ ని పెళ్లి చేసుకొని మూడేళ్లు అవుతోంది. అయితే పిల్లల సంగతి ఏమిటనే ప్రశ్నలు ఎన్నో ఎదురవుతున్నాయట. ఇక ఇటీవల వాటిపై క్లారిటీ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
సోషల్ మిడియల్ నెటిజన్స్ తో చిట్ చాట్ చేసిన అనుష్క శర్మ కొంతమంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక మీ చుట్టూ ఉన్నవాళ్ళు పిల్లల్ని ఎప్పుడు కంటారు అనే ప్రశ్నలు వేయడం లేదా అనే ప్రశ్నపై స్పందిస్తూ.. అలా ఏమీ లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు అని అనుష్క వివరణ ఇచ్చింది. గతంలోనే అనుష్క ప్రెగ్నెంట్ అనే రూమర్స్ రాగా అవన్నీ అబద్దాలని కొట్టి పారేసింది.