ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ తమిళ నటి కుష్బూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక దుండగుడు కారణం లేకుండా ఇష్టం వచ్చినట్లు బెదిరించడంతో కుష్బూ అతనికి ఊహించని ఝలక్ ఇచ్చింది.
అతని ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి పరువు తీసేసింది. తనకు ఫోన్ చేసి రేప్ చేస్తాను, చంపేస్తాను అంటూ ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ ఇలాంటి వాళ్ళకి పబ్లిక్ లోనే పరువు పోయేలా చేయాలని అన్నారు. వాడికి కూడా ఒక కుటుంబం ఉంటుంది కాదా అయినా కూడా ఇలా ఎలా నిందిస్తారు అంటూ అతను కోల్ కతాకు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బేనర్జికి పిర్యాదు చేసిన కుష్బూ ఇలాంటి వ్యక్తుల నుంచి నా లాంటి వారికి కాల్స్ వస్తున్నాయి అంటే మీ రాష్ట్రంలో ఆడవాళ్లు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అని కుష్బూ వివరణ ఇచ్చారు.