శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన `96` చిత్రానికి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ – “మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ రూపొందాయి. వాటికి ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ కూడా లభించిన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. తమిళంలో విజయవంతమైన `96` చిత్రాన్ని తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల ద్వితీయార్థంలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. ముందు 15 రోజుల పాటు కెన్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో జూలై కంతా చిత్రీకరణను పూర్తి చేస్తాం“ అన్నారు.
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, రచన: మిర్చి కిరణ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: జె.మహేంద్రన్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్.