‘1997’ సినిమాలో “ఏమి బతుకు…ఏమి బతుకు” సాంగ్ కి 8 మిలియన్ వ్యూస్ !!

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ సినిమా చిత్రం నుండి ఏమి బతుకు ఏమి బతుకు అనే పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట ఇటీవల విడుదల అయి సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించింది. అంతేకాక ఈ పాట యూ ట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈ ‘ఏమి బతుకు’ అనే పాటకు డాక్టర్ మోహన్ మరియు ఆదేష్ రవిలు లిరిక్స్ రాయగా, సింగింగ్ సెన్సేషన్ మంగ్లీ పాడింది.

ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించిన క్రమంలో కోటి మాట్లాడుతూ ఈ పాట మారుమ్రోగిపోతూ మీరు వినుంటారు, ఇప్పటికే 8 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాటను ప్రతి ఒక్కరూ ఆదరించారని అన్నారు. ఈ పాటకు మోహన్ గారు చక్కటి సాహిత్యం అందించడం, మంగ్లీ గారు పాడడం అడ్వాంటేజ్ అని అన్నారు. ఆమె ఏ పాట పాడినా సూపర్ హిట్ అని ఆయన అన్నారు. డాక్టర్.మోహన్ డైరెక్షన్ చేస్తూ సినిమాలో మెయిన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారని, మన దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, కనీసం ఈ సినిమా చూసి అయినా వాళ్ళు మారతారు అని ఉద్దేశంతో మోహన్ గారు ఈ సినిమా చేశారని పేర్కొన్నారు.

అరుంధతి సినిమా తర్వాత తాను మ్యూజిక్ కి గ్యాప్ తీసుకున్నానని కానీ మోహన్ తనకు కొడుకు లాంటి వారని, ఆయన పట్టువదలకుండా మీరే చేయాలనీ కోరడంతో చేశానని అన్నారు. ఇక ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారని తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.