67 నేష‌న‌ల్ అవార్డ్స్‌.. తెలుగు ఉత్త‌మ చిత్రంగా జెర్సీ.. మ‌హర్షి చిత్రానికి ఏకంగా మూడు‌!

National Awards: నేడు 67వ జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వ అవార్డుల‌ను తాజాగా కేంద్రం ప్ర‌క‌టించింది. దిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ అవార్డుల‌ను వెల్ల‌డించారు. తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నాని న‌టించిన జెర్సీ చిత్రం ద‌క్కించుకుంది. అలాగే ఉత్త‌మ ఎడిటింగ్ విభాగంలో జెర్సీ చిత్రానికి ఎడిట‌ర్ అయిన న‌వీన్ నూలి ద‌క్కించుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై గౌత‌మ్ తిన్న‌నూరి నిర్మించారు. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రానికి ఏకంగా మూడు అవార్డులు వ‌రించాయి..

ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌గా రాజు సుంద‌రం(మ‌హ‌ర్షి), ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రంగా, ఉత్త‌మ నిర్మాణ సంస్థ మ‌హ‌ర్షి చిత్రం ద‌క్కించుకుంది. ఇక బాలీవుడ్ విష‌యానికొస్తే.. దివంగ‌త యంగ్ హీరో సుశాంత్ సింగ్ న‌టించిన చిత్రం చిచోరే అవార్డు కైవసం చేసుకుంది. ఉత్త‌మ న‌టిగా కంగ‌నా ర‌నౌత్ (మ‌ణిక‌ర్ణిక‌) అవార్డు ద‌క్కించుకుంది. కోలీవుడ్‌లో స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన చిత్రం అసుర‌న్ ఉత్త‌మ చిత్రంగా అవార్డు సంపాదించుకుంది.. అలాగే బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ జ‌ల్లిక‌ట్టు చిత్రం ద‌క్కించుకుంది.