‘‘47 డేస్’’ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుంది- ట్రైల‌ర్ లాంచ్ వేడుకలో అతిధులు

47 days movie trailer launch event

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్ కార్యక్రమం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ లాంచ్ చేసి టీం కి శుభాకాంక్ష‌లు తెలిపారు.

47 డేస్ మూవీ ట్రైలర్

ఈ సంద‌ర్భంగా అతిథులు, చిత్ర యూనిట్ మాట్లాడుతూ

తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ మాట్లాడుతూ:
ఈ సినిమా చూస్తుంటే బాల‌చంద‌ర్ 47 డేస్ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి నా మొగుడు కావాలి సినిమా వాయిదా వేసి మ‌రీ చేసాడు. అలా మా సినిమా హిట్ కి ప‌రోక్షంగా 47 డేస్ కారణం అయ్యింది. ఈ సినిమా కూడా ‘‘నా మొగుడు కావాలి’’ అంత హిట్ కావాలి అని కోరుకుంటున్నాను. ర‌ఘ సినిమా చేస్తాన‌న్న‌ప్పుడు ఎందుకు మ్యూజిక్ చేసుకుంటూ బాగానే ఉన్నాం క‌దా! అన్నాను. కానీ సినిమా ట్రైల‌ర్ చూసాక మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను .

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ మాట్లాడుతూ:
కంటెంట్ ని న‌మ్ముకున్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం . ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ నాకు ముందునుండి తెలుసు. అత‌ని కెపాసిటీ, క్లారిటీ నాకు తెలుసు.ప్ర‌దీప్ ఈసినిమాను ఎంత చ‌క్క‌గా చేసి ఉంటాడో ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్దం అవుతుంది. ఒక సూపర్ హిట్ సినిమా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ:
ర‌ఘు ఏం చేసినా నాకు ముందే చెబుతాడు. ఈ సినిమా ఐడియా స్థాయి నుండి ఇప్పుడు వ‌ర‌కూ నాకు తెలుసు. సినిమా రిలీజ్ కి ముందే నిర్మాత‌లు కు డ‌బ్బులు తెచ్చే సినిమా ఇది. వారి టెన్ష‌న్స్ పోయి ఊపిరి తీసుకుంటారు.స‌త్య లాంటి హీరోస్ ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం ఒక కాన్సెప్ట్ ని న‌మ్ముకొని సినిమాలు తీసే వారికి స‌త్య లాంటి హీరోలు ఎప్పుడూ మొద‌ట ఆప్ష‌న్ అవుతారు.ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం నాకు ఉంది.

దర్శకుడు బివియ‌స్ ర‌వి మాట్లాడుతూ:
స‌త్య కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అత‌ని సినిమాలు చూస్తుంటే ఆర్టిస్ట్ గా అత‌ను ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తునే ఉంటాడు. ఈసినిమాకి నిర్మాత‌లు ఎవ‌రు అని కూడా అడ‌గ‌ను ఎందుకుంటే ఈ సినిమా స‌క్సెస్ తో వాళ్ళు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ్వాల‌ని కోర‌కుంటున్నాను.

స‌తీష్ కాశెట్టి మాట్లాడుతూ:
ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత స‌త్య అంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండ‌స్ట్రీ లో హిట్ వ‌స్తే మ‌నుషుల‌ను గుర్తు ప‌ట్ట‌డం మానేస్తారు. కానీ స‌త్య నిర్మాత‌ల‌కు ద‌ర్శ‌కుల‌కు అందుబాటులో ఉండాల‌ని కోర‌కుంటున్నాను.స‌త్య మంచి ఆర్టిస్ట్ అత‌ని సామ‌ర్ధ్యం ఇందులో బ‌య‌ట‌ప‌డుతుంది. ట్రైల‌ర్ చాలా ఇంప్రెస్ గా ఉంది.

క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ:
ఇండ‌స్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్ట‌ర్స్ ఉంటారు కానీ స‌త్య మాత్రం స్టార్ యాక్ట‌ర్ లా అనిపిస్తాడు. ఈసినిమాకి సంబందించి డైరెక్ట‌ర్ ని హీరోని క‌లిపిన క్రెడిట్ నాకే ద‌క్కుతుంది. ఈ విష‌యంలో నేను చాలా
హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈసినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం నాకు ఉంది.

దర్శకుడు వెంకటేష్ మ‌హా మాట్లాడుతూ:
ప్ర‌దీప్ నాకు ఇండ‌స్ట్రీలో యాక్ట‌ర్ గా ట్రై చేస్తున్న‌ప్ప‌టి నుండి తెలుసు. విజువ‌ల్స్ తో అద‌ర‌గొట్టాడు. స‌త్య కి ఈసినిమా మంచి విజ‌యం అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాను

ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ:
ఇది నా సొంత సినిమా లాంటిది. ఇందులో ప‌నిచేసిన అంద‌రూ నా సొంత వారే. త‌మిళంలో విజ‌య్ శేతుప‌తికుండే గ్రాఫ్ నాకు స‌త్య‌లో క‌నిపిస్తుంది. చిన్న‌ప్ర‌య‌త్నంగా మొద‌లు పెట్టారు. ఈసినిమా నిర్మాణంలో ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఎంత ఓపిక‌తో ప‌నిచేసారో నాకు తెలుసు. ఈ సినిమా అందరికీ
మంచి విజ‌యం అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాను

గేయ రచయిత భాస్క‌ర‌బ‌ట్ల మాట్లాడుతూ:
47 కి మూడు క‌లిపితే 50 అవుతుంది ఈ సినిమా రెండు 50 రోజులు ఆడాల‌ని కోర‌కుంటున్నాను. ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్..పూరి జ‌గ‌న్నాథ్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుండి తెలుసు. అత‌ని స‌మ‌ర్ధ‌త ఎంటో కూడా తెలుసు. ఏ ప‌ని చేసినా అందులో చాలా డిటైల్డ్ వ‌ర్క్ చేస్తాడు. అత‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యే సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. హీరో స‌త్య ఎంటో జ్యోతి ల‌క్ష్మి లో చూసాం.ఇందులో అత‌ని లోని న‌ట‌న పూర్తిగా ఆవిష్క‌రించ‌బ‌డుతుంద‌ని అనుకుంటున్నాను. టీం అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు.

ర‌ఘు కుంచె మాట్లాడుతూ:
ఒక చిన్న ప్ర‌య‌త్నంగా ఈసినిమా మొద‌లు పెట్టాం. చాలా ఓర్పుతో ఈసినిమా ని ఇక్క‌డి వ‌ర‌కూ తీసుకొచ్చాం. ఒక క్వాలిటీ సినిమా అందించాల‌నే మా ప్ర‌య‌త్నం తో అనుకున్న దానికంటే కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం. మంచి క్వాలిటీ సినిమాని అందించ‌గ‌లిగితే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తానే
న‌మ్మ‌కం మాకు ఉంది. ఈసినిమా చూసిన ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల్ అవుతారు. స‌త్య , ప్ర‌దీప్ ల వ‌ర్క్ ఎంటో సినిమా లో అర్దం అవుతుంది.

నిర్మాత‌లు శ‌శి భూషణ్, శ్రీధ‌ర్,విజయ్ లు మాట్లాడుతూః
క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుంతా అనే న‌మ్మ‌కం ఉంది అన్నారు

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మ‌ద్దాలి మాట్లాడుతూ:
నేను సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ గాఉంది ఈ పీల్డ్ కి వ‌స్తాన‌న్న‌ప్పుడు నాకు అండ‌గా నిలిచిన నా త‌ల్లిదండ్రుల‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈసినిమా ట్రైల‌ర్ ర‌ఫ్ క‌ట్ చూసిన రాంగోపాల్ వ‌ర్మ‌గారు మీరు విజువ‌ల్స్ తో స్టోరీ
చెప్పారు అన్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్ లా అనిపించింది. ఈసినిమాటెక్నిక‌ల్ గా హై గా ఉంటుంది. నాకు స‌పోర్ట్ గా నిలిచిన సిన‌మాటోగ్రాఫ‌ర్ జికె కి ధ్యాంక్స్. స‌త్య నాకు ఇచ్చిన స‌పోర్ట్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ:
నా కెరియర్ బ్రేక్ ప్ర‌దీప్ తోనే వ‌చ్చింది. నా వీడియో ఎవ‌రో చూపిస్తే అది చూసి న‌న్ను ఆడిష‌న్స్ కోసం జ్యోతి ల‌క్ష్మి కి కాల్ చేసాడు. అలా నా కెరియ‌ర్ కి పెద్ద బ్రేక్ రావడానికి ప్ర‌దీప్ కార‌ణం. అత‌ని రుణం
తీర్చుకోలేను. పెద్ద మాట‌లా అనిపించినా అది నిజం. ఇక ఈ సినిమా విష‌యంలో నేను హీరో గా చేస్తున్నాను అన‌గానే చాలా మంది వెన‌క్కులాగే ప్ర‌య‌త్నం చేసారు. కానీ నాతోనే ఈసినిమా చేయాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబట్టి చేసాడు. ప్ర‌దీప్ చేసే ప‌నిలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ అంటే నాకు
ఇష్టం. ఈ రోజు వేదిక మీద మాట్లాడిని వారందరీ మాట‌లు వింటే నాకు క‌డుపు నిండిపోయింది. న‌న్ను ఇంత‌గా అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సినిమా విష‌యంలో నేను చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వింటాను.

నటీనటులు:

సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్,రవివర్మ , శ్రీకాంత్ అయ్యంగార్, హరితేజ, ఇర్ఫాన్, ముక్తార్ ఖాన్,కిరీటి దామరాజు,అశోక్ కుమార్ తదితరులు.

టెక్నీషియన్స్:

కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సొహాని,
సినిమాటోగ్రఫీ : జి.కే,
సంగీతం : రఘు కుంచే ,
ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్,
డిజైన్స్ – అనిల్ భాను
యాక్షన్ -స్టంట్స్ శ్రీ
కొరియోగ్రఫీ: నిక్సన్ డి,క్రూజ్
పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా,
పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ ,ప్రీతి కేశవన్
నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు,రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ
రచన,దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి