’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’.. హిట్టా?. ఫట్టా?

బుల్లితెరపై యాంకర్‌గా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్.. సిల్వర్ స్క్రీన్‌పై పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవ్వగా.. తొలిసారి ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలోని ‘నీలీ నీలీ ఆకాశం’ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించడంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

30 ROJULLO PREMINCHADAM ELA REVIEW

ప్రదీప్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే సినిమాలోని ట్విస్ట్‌లు బాగున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకున్నాయి. ఫస్టాప్‌లో ప్రదీప్ కామెడీ, పాటలు బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ చాలా కొత్తగా ఉంది. ఫస్టాఫ్‌లో కామెడీ ఎక్కువగా ఉండగా.. సెకండాఫ్‌లో లవ్ స్టోరీ ఉంటుంది. ఇక హైపర్ ఆది కామెడీ కూడా బాగుంది.

కాగా కొత్త డైరెక్టర్ మున్నా ఈ సినిమా తెరకెక్కించగా.. . తమిళ భామ అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు నిర్మించాడు.