ప్రదీప్ సినిమాకు భారీ కలెక్షన్లు

యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా మిక్స్ డ్ టాక్‌ను అందుకోగా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తుంది. జనవరి 29న ఈ సినిమా విడుదల అవ్వగా.. తొలి వారం రూ.14 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఒరిజినల్ షేర్ దాదాపు రూ.5 కోట్లకుపైగా వచ్చిందని సినిమా యూనిట్ ప్రకటించింది.

30 rojullo preminchadam ela

ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి కొంత మొత్తం వస్తే.. మొత్తం రూ.8 కోట్ల వరకు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. కలెక్షన్ల పరంగా సినిమా హిట్ అయిందని చెప్పవచ్చు. కాగా త్వరలో ప్రదీప్ రెండో సినిమా ప్రారంభం కానుంది. ల