హీరోయిన్ అనన్య నాగళ్ల చేతుల మీదగా “23” మూవీ సాంగ్ లాంచ్

మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటీవల విడుదల టీజర్‌ సెన్సేషనల్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సినిమా నుంచి కోసీ కోయ్యంగానే సాంగ్ లాంచ్ చేశారు. మార్క్ కె రాబిన్ ఈ పాటని రా అండ్ రస్టిక్ ఎనర్జీ వున్న పవర్ ఫుల్ నెంబర్ కంపోజ్ చేశారు.

ఈ సాంగ్ కి వరంగల్ శంకర్ రాసిన సాహిత్యం ఉర్రూతలూగించేలా వుంది. రేలా జాన్ సాంగ్ హై ఎనర్జీ తో పాడటం మరింత ఆలరించింది. ఈ సాంగ్ లో లీడ్ యాక్టర్స్  రస్టిక్  డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.  

ఈ చిత్రానికి సన్నీ కూరపాటి అద్భుతమైన సినిమాటోగ్రఫీ. అనిల్ ఆలయం ఎడిటర్, లక్ష్మణ్ ఏలే ఆర్ట్ డైరెక్టర్.  

తారాగణం: తేజ, తన్మయి, ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రాజ్ ఆర్
బ్యానర్: స్టూడియో 99
విడుదల: రానా స్పిరిట్ మీడియా
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి
ప్రొడక్షన్ డిజైన్: లక్ష్మణ్ ఏలే
ఆర్ట్ డైరెక్షన్: విష్ణు వర్ధన్ పుల్లా
కాస్టింగ్ డైరెక్షన్: మహేష్ గంగిమల్ల
డైలాగ్స్: ఇండస్ మార్టిన్
ఎడిటింగ్: అనిల్ ఆలయం
కాస్ట్యూమ్ డిజైన్: శ్రీపాల్ మాచర్ల
సాహిత్యం: చంద్రబోస్, రెహమాన్, సింధు మార్టిన్