ఈ నెల 30న రిలీజ్ కానున్న “కిల్లర్” – 21న ట్రైలర్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. “కిల్లర్” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది.

ఈ రోజు మేకర్స్ “కిల్లర్” సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 21న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. “కిల్లర్” సినిమా ట్రైలర్ పై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఓవర్సీస్ లో “కిల్లర్” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ “కిల్లర్” సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )

Related Articles

Latest Articles