తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో పని చేసిన మాజీ ఉద్యోగికి వైద్య సదుపాయం కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాస రావు

హైదరాబాద్ లోని తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో 2014 వరకు పనిచేసిన ఒక ఉద్యోగి రామకృష్ణ. ఆయనకు జిపిఎస్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల అతని బాడీలోని అన్ని అవయవాలు దెబ్బ తినడంతో అతనికి వైద్యం చేయించడం కోసం ఆర్థికంగా సాయం చేస్తూ ప్రముఖ దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు 10 లక్షల రూపాయల ఆయన భార్యకు అందచేసి సాయం చేయడం జరిగింది. ఆయన గతంలో కూడా సినిమాలకు సంబంధించిన 24 క్రాఫ్టుల వారికి, ఫిలిం ఫెడరేషన్ కూడా ఇలాగే ఎన్నోసార్లు ఆర్థిక సాయం చేస్తూ తనదైన శైలిలో కళామతల్లికి తాను సేవ చేస్తూ వచ్చారు. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి నిత్యవసర వస్తువులను అందజేసి అందరికీ అండగా నిలబడ్డారు. ఎంతో ఆప్యాయతతో అందరితో కలిసి పని చేసిన రామకృష్ణకు ఆర్థికంగా సహాయపడటం తమకు చాలా సంతోషంగా ఉందని నిర్మాతల మండలి ఉద్యోగులు తెలిపారు. అలాగే చిత్ర పరిశ్రమ నుండి ఇదేవిధంగా ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ ఆయనకు గత కొంత కాలంగా ఆరోగ్యం బాలేదని, ఆ విషయం తెలిసిన వెంటనే చదలవాడ శ్రీనివాసరావు గారు వారికి సహాయం చేయడం వారికి ఆర్థిక పరంగా బలం ఇవ్వడం సంతోషకరం అని ఆమె తెలిపారు. తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఈ క్రమంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీ నుండి కోసం పని చేసిన నా భర్త కోసం చదలవాడ శ్రీనివాసరావు గారు, తుమ్మల ప్రసన్నకుమార్ గారు అండగా నిలబడినట్లు అందరూ ఇలాగే ముందుకు రావాలని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని ఆమె తన భావం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles