
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రెస్టీజియష్ చిత్రాలను నిర్మిస్తోన్న భారీ నిర్మాణ సంస్థ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘భారతీయుడు3’. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీకి స్వీకెల్‌గా భారతీయుడు2, భారతీయుడు 3 చిత్రాలను కమల్, శంకర్ కాంబోలో రూపొందించటానికి లైకా సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా 2024లో భారతీయుడు 2 విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు3’ను చిత్రీకరించటానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఇప్పటికే ‘భారతీయుడు3’లో కొంత భాగాన్ని చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 10 రోజుల్లో ‘భారతీయుడు3’కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేయటానికి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దుమ్ము, దూళి రేగుతున్నట్లుగా ఉండే ఫొటో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. భారతీయుడు 3 ఎలా ఉండబోతుందనే విషయాన్ని భారతీయుడు 2 క్లైమాక్స్‌లో చూపించారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను రూపొందించటంతో పాటు స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్, అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ మూవీగా ‘భారతీయుడు3’ని మనకు అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి సేనాపతి లంచాన్ని అంతమొందించటానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
సాధారణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త సుభాస్కరన్. వ్యాపార రంగంలో సాధించిన విజయాన్ని సినిమా రంగంలోనూ కొనసాగిస్తూ, లైకా ప్రొడక్షన్స్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టారు. వైవిధ్యమైన కంటెంట్ చిత్రాలతో పాటు ‘2.0’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత విస్తరింప చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడమే కాకుండా, కొత్త ఆలోచనలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నాణ్యమైన కథనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకత. భారతీయ సంస్కృతి, ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో లైకా ప్రొడక్షన్స్‌లో సినిమాలను రూపొందిస్తున్నారు.
నటీనటులు:
కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్
స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్
మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
ఆర్ట్: ముత్తురాజ్
స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ
డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్
కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్
పాటలు: శ్రీమణి
సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్
మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్, అబ్దుల్ ఏ ఆర్
కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్బి సతీషన్-పల్లవి సింగ్-వి.సాయి
పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య
పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్
హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్


