‘ప్రేమనే ఊరిలో’ చిత్ర రివ్యూ

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు, గోవింద్ gowfa తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక పల్లెటూరిలో చదువును విడిచి తన తండ్రిపై ప్రేమతో ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకునే యువకునికి బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకుంటారు తన తండ్రి. అలా ఉన్న పరిస్థితిలో అదే ఊరిలో ఆ యువకుడిని మరొక అమ్మాయి ప్రేమిస్తుంది. కాని ఆ యువకుడు మరొక అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యువకునికి మరొక బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అసలు ఆ అనివార్య పరిస్థితులు ఏంటి? అతడిని ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏంటి? అతను ప్రేమించిన అమ్మాయి ఎవరు? అసలు అనుకోకుండా జరిగి పెళ్లి ఆ తర్వాత వారి బంధం నిలుస్తుందా లేదా? ఆ యువకుని తండ్రి చెట్లు నాటడానికి కారణం ఏంటి? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్ ఒక పల్లెటూరి యువకుని పాత్రలో చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఎమోషన్స్ విషయంలో అద్భుతంగా నటించారు. తపస్విని పూనాచ విదేశాల నుండి వచ్చి ఒక పల్లెటూరిలో అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రమిక శివు ఒక పల్లెటూరి అమ్మాయిలా చలాకీగా ఉంటూ సినిమాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. రంగాయణ రఘు సినిమాలో ఒక బాధ్యతగల పల్లెటూరి తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జీవించారని చెప్పుకోవచ్చు. గోవింద్ గౌడ మంచి కామెడీ చేశారు. హీరో మిత్రులుగా, హీరోయిన్ మిత్రులుగా నటించిన వారంతా పరిస్థితికి అనుకూలంగా బాగా చేశారు. అదే విధంగా సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక సింపుల్ కథను ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా వెండి తెరపై చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. సినిమాలో మొదటి భాగం కాస్త నిదానంగా ఉన్నప్పటికీ రెండవ భాగంలో ఉన్న ఎమోషన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. లొకేషన్స్ చాలా న్యాచురల్ గా వాటిని చూపించే సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమాలోని పాటలు పెద్ద బోనస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కలరింగ్, కాస్ట్యూమ్స్ వంటి ఇతర సాంకేతిక విషయాలు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, పాటలు, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :
మొదటి భాగం నిదానంగా ఉండటం

సారాంశం :
మంచి ఎమోషన్స్ తో ఒక సింపుల్ సినిమా కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ప్రేమనే ఊరిలో.

Related Articles

Latest Articles