
కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం థియేటర్ ప్లస్ ప్రస్తుతం ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తోంది. డిఫరెంట్ కంటెంట్, భిన్న సినిమాల్ని ప్రేక్షకులకు అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీ లేకుండా, పేమెంట్ అన్నది లేకుండా ఉచితంగానే ఈ వారం మూడు సినిమాల్ని అందరికీ అందిస్తోంది. మూడు డిఫరెంట్ జానర్స్‌లో వచ్చిన గుమాస్తా, 4 వసంతాలు, జై గణేష్ చిత్రాలు ఈ వారం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంలోకి రాబోతోన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా మూడు డిఫరెంట్ జానర్‌లో థియేటర్లోకి వచ్చి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి.
‘గుమాస్తా‘ చిత్రం న్యాయ వ్వవస్థ, అందులోని లోపాల చుట్టూ తిరుగుతుంది. చట్టంలోని లూప్ హోల్స్ తెలిసిన లాయర్ క్లర్క్ అతని భార్య అనుమానాస్పద మృతిలో ప్రధాన ముద్దాయిగా ఉంటాడు. పిల్లిఎలుకలా సాగే ఈ ఆటలో చివరకు ఏం జరుగుతుందనేది ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. చివరకు వెళ్లే సరికి ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వస్తుంటాయి. అలా క్లైమాక్స్‌కి అందరూ ఆశ్చర్యపోతారు.
‘నాలుగు వసంతాలు‘ ఓ అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు అందిస్తుంది. నాలుగేళ్ల కాలేజ్ జర్నీలో ఓ ప్రేమ కథ, బ్రేకప్ వంటి అంశాల్ని ఎంతో అందంగా చూపిస్తారు. కాలేజ్ నుంచి బయటకు వెళ్లే టైంకి వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయన్నది ఈ కథాంశం. ‘జై గణేష్’ చిత్రం ఓ చిన్న పిల్లాడి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఇందులోని ఇన్వెస్టిగేషన్ అందరినీ సీటు అంచున కూర్చోపెడుతుంది. చివరకు వచ్చే ట్విస్ట్‌లు, నేరస్థుడ్ని పట్టుకునే తీరు అద్భుతంగా ఉంటుంది.
ఇలా ఈ మూడు డిఫరెంట్ చిత్రాలతో ఈ వారం థియేటర్ ప్లస్ ఓటీటీ సంస్థ తన సబ్ స్క్రైబర్లను ఎంటర్టైన్ చేయనుంది.


