
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. జివి ప్రకాష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్ ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ చేయగా ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక తీర ప్రాంతంలో జరిగే తెరచాప పదవపోటీల తరుణంలో జరిగే కథగా చెప్పుకోవచ్చు. కలింగపట్టణంలో ప్రతి సంవత్సరం పడవ పోటీలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిసారి గెలిచే కలిగా వారియర్స్ టీం లోని ఇతడు స్నేహితులు కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయి శత్రువులతో మారతారు. వారిలో ఒక వ్యక్తి ఊడి విడిచి వెళ్లిపోగా మరొక వ్యక్తి మాత్రం అక్కడే ప్రతి సంవత్సరం పోటీలలో గెలుస్తూ బయట ప్లేయర్స్ ను తమ చెట్టులో చేర్చుకుని ఆ ఊరి యువకులను ప్రోత్సహించకుండా ముందుకు వెళుతూ ఉన్న సమయంలో ఆ ఊరి యువకులు కూడా ఆగడానికి వచ్చినప్పుడు అవమానించిన ఇచ్చిన కారణంగా కొన్ని వైరాలు తలెత్తుతాయి. ఇది ఇలా ఉండగా ఊరి విడిచి వెళ్లిన స్నేహితుడు ఆ యువకుల కోసం తిరిగి వస్తాడు. అసలు ఆ స్నేహితులు ఇద్దరి మధ్య వేయడం ఎందుకు వస్తుంది? ఊర్లోని యువకులను ఆడకుండా చేయడానికి కారణం ఏంటి? అసలు ఆ స్నేహితుడు ఊరు విడిచి వెళ్లిపోయేంత ఏం జరుగుతుంది? చివరికి ఆ యువకులతో అతడు పడవ పోటీలలో పాల్గొంటారా లేదా అతని గతం వల్ల వెను తిరుగుతాడా? చివరికి పడవ పోటీలు దొరుకుతాయా లేదా? వారికి ఈ ప్రయాణంలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి? చివరికి ఎవరు గెలుస్తారు? అని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూరి (ముత్తుకాళి), సుహాస్ (చాటపులి). వీరిద్దరూ అటు యువకులు లాగా అలాగే కాస్త మిడిల్ ఏజ్ పాత్రలలో చాలా బాగా నటించారు. ముందుగా వాడి స్క్రీన్ ప్రజెంట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. విలువలు ఉన్న పాత్రలో సూరి అద్భుతంగా నటించారు. అలాగే కాస్త గ్రే షీట్స్ తో సుహాస్ కూడా తగ్గ పోటీ ఇచ్చారు. మరి ముఖ్యంగా సముద్ర తీరాన నివసించే జాలరుల తరహా యాసతో అలాగే వారి డ్రెస్సింగ్ ఇంకా జీవనశైలిలో అద్భుతంగా కనిపించారు. మహిమా నంబియార్ (ఏంజెల్ చిలకమ్మ) సినిమాలో తన పాత్రకు తగ్గట్లు నటిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. గ్లామర్ రోడ్డు కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానం ఉండటం విశేషం. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. చిత్రంలో కనిపించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు ప్లస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
మతిమారన్ పుగళేంది కథను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించడంలో అద్భుతమైన విజయం సాధించారు. ప్రేక్షకులు అంతా తెరపై కనిపిస్తున్న సినిమాకు ఎమోషనల్ గా ఎంతగానో కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను రూపొందించడం మంచి విజయమని చెప్పుకోవాలి. సినిమాలో పాటలు అలాగే బిజిఎం చాలా బాగున్నాయి. కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులకు బీజయం వల్ల గూస్బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో చేయడంతో సినిమాకు ఒక నాచురాలిటీ యాడ్ అయింది. అక్కడక్కడ తెలుగు వెర్షన్ లో తమిళ్ అక్షరాలు కనిపించడం పై దర్శకుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. కలరింగ్, విఎఫ్ఎక్స్ వంటిఇతర సాంకేతిక విలువలు అన్ని బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, సంగీతం.
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు.
సారాంశం :
ప్రేక్షకులు అంతా సీట్ ఎడ్జ్ లో కూర్చుని కనీసం మొబైల్ కూడా పట్టుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఎమోషనల్ ఫీల్ అయ్యే మంచి చిత్రం మండాడి.


