శివసాగర్ వరద బాధితులకు చేయూతనందించిన “నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్”, ‘ది ఎంబ్రియోస్ – అంకురణ్’

అస్సాం వరద బాధితులకు అండగా నిలబడి సాయం చేసినందుకుగాను ‘నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ కు కృతజ్ఞతలు తెలుపుతూ స్పందించిన అస్సాం మీడియా. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేసేందుకు ‘ది ఎంబ్రియోస్-అంకురణ్’ (The Embryos-Ankuron) ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఈ కష్టసమయంలో బాధితులకు ఆహారం, దుస్తులు, నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన ‘నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ తో కలిసి ‘ది ఎంబ్రియోస్-అంకురణ్’ సభ్యులు కమలలోచన్ బర్మన్, దిగంత దత్తా, దులాల్ దాస్, కౌశిక్ హాలోయ్, నితుల్ బర్మన్, హరేన్ హాలోయ్, షాజమాల్ ఇస్లామ్‌లు శివసాగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ వరద బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు అత్యవసరమైన బియ్యం, పప్పుధాన్యాలు, శానిటరీ, బిస్కెట్లు, దుస్తులు, ఇతర నిత్యావసర సామాగ్రిని పంపిణీ చేశారు. కష్టకాలంలో బాధితుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి ఆసరాగా నిలిచిన ఈ రెండు సంస్థల సేవలను పలువురు విశేషంగా ప్రశంసించారు.

Related Articles

Latest Articles