
అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తొలి చిత్రం అమీర్ లోగ్. హరి మున్నంగి, శశిధర్ కోచర్లకోట, మనోజ్ ఆవుల, వేద జలంధర్ ప్రముఖ పాత్రలు వహించిన ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి రోహిత్ ఎడిటింగ్ చేయగా సాయి యోగి, రావణ్, విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ కుర్రాళ్ల కథల చెప్పుకోవచ్చు. బస్తీలోని ముగ్గురు యువకులు ఖాళీగా అల్లరిగా తిరుగుతూ ఉండగా వారి జీవితాలు సెటిల్ అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు. అలా ముందుకు వెళ్తున్న ఒక యువకుడి జీవితంలో మలుపువల్ల ముగ్గురు కలిసి మరొకరి వ్యాపారం లోకి దిగుతారు. ఆ బస్తీలో వారిని జనమంతా తమ సొంతవాడిన ట్రీట్ చేస్తారు. కానీ ఆ బిజినెస్ సక్సెస్ అయ్యిందా లేదా? వారి జీవితలోకి వచ్చే ఈ వ్యాపారం వల్ల జీవితాలు ఎలా మారుతాయి? అదే బస్తీలోని ఒక అమ్మాయి వారికి అండగా నిలబడుతుందా లేదా వెనుతిరుగుతుందా? చివరికి ఆ బస్తీకి, వారి జీవితాలకి ప్రయాణం ముందుకు సాగుతుందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ప్రముఖ పాత్రలు పోషించిన ముగ్గురు యువకులు వేరువేరు పనులు చేసుకుంటూ సంపాదనలో ఒక ఫస్ట్ యువకులు లాగా పర్ఫెక్ట్ గా నటించారు. ముఖ్యంగా వారి మాస్ భాష అలాగే వారి ప్రవర్తన ఆ పాత్రలకు బాగా సూట్ అయింది. అలాగే వేద జలంధర్ ఒక బస్తీ యువతీ లాగా చాలా బాగా చేశారు. బస్తీలో ఉన్నప్పుడు బస్తీ అమ్మాయిలాగా అలాగే తన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సాఫ్ట్ గా కనిపించే ఒక ఉద్యోగిని లాగా చాలా బాగా రెండు విధాలుగా అందంగా కనిపించారు. ఈ పాత్రలకు బాగా సపోర్ట్ ఇచ్చిన ఇతర కీలక పాత్రలు అందరూ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.
సాంకేతిక & చిత్ర విశ్లేషణ :
గతంలో ఇటువంటి హైదరాబాది కల్చర్ చూపిస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కాస్త మాస్ గా బస్తి జీవితాలు చూపిస్తూ కూడా కొన్ని పూర్తి సినిమాలు అలాగే సినిమాలలో కొంత వరకు చూపించడం జరిగింది. కానీ ఈ చిత్రంలో ఫస్ట్ జీవితాలు ప్రధానంగా అక్కడ ఉండే మాస్ ఇంకా బంధాలు చూపిస్తూ ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించారు. సినిమా నెమ్మదిగా వెళుతున్నప్పటికీ ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. బస్తీ భాష కాస్త అర్ధం కాకపోయినప్పటికీ ఎమోషన్ అర్థమవుతుంది. భాష విషయంలో మరి కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రఫీ అలాగే లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. పాటలు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కలరింగ్, చిన్నపాటి విఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక విషయాలలో మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, పాటలు, నటీనటులు నటన, కామెడీ, ఎమోషన్స్
మైనస్ పాయింట్స్ :
భాష, సినిమా కాస్త నెమ్మదిగా ఉండటం
సారాంశం :
హైదరాబాద్ లోని బస్తీ జీవితాలు చాలా సర్వసాధారణంగా ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు అక్కడ అనుబంధాలు, అనుభూతులు చూపించే పక్కా హైదరాబాద్ బస్తీ జీవిత చిత్రం అమీర్ లోగ్.


