
ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తమిళ్ నటుడు ప్రభు, మాజీ మంత్రి ఆర్కే రోజా, తమిళనాడు మాజీ మంత్రి కడంబూర్ రాజు, తమిళనాడు తిరువీర్ వేరువేరుగా స్వామి వారిని దర్శించుకుని భక్తులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరిని వేదమంత్రాలతో ఆశీర్వదించగా టిటిడి అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.


